Homeహైదరాబాద్latest Newsబిగ్ బాస్ సీజన్‌ 7 కంటెస్టెంట్ కి యాక్సిడెంట్‌

బిగ్ బాస్ సీజన్‌ 7 కంటెస్టెంట్ కి యాక్సిడెంట్‌

తెలుగు బిగ్ బాస్ సీజన్‌ 7 ఫేమ్ శుభశ్రీకి తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఆమె ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. ఆమె సినిమా షూటింగ్‌ కోసం కారులో వెళ్తుండగా నాగార్జున సాగర్‌ మాచర్ల ఆర్టీసీ గ్యారేజీ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.మద్యం మత్తులో బైక్‌పై వెళ్తున్న ఓ వ్యక్తి ముందు నుంచి వేగంగా వచ్చి శుభశ్రీ కారును ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో సుభాశ్రీకి ఎలాంటి గాయాలు కాలేదు కానీ కారు ముందు భాగం నుజ్జునుజ్జయింది. అందరూ క్షేమంగా ఉన్నారని చిత్ర యూనిట్ తెలిపింది.ప్రస్తుతం ఆమె కథానాయికగా ఓ సినిమా రూపొందుతోంది. సినిమా షూటింగ్‌కి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

Recent

- Advertisment -spot_img