– అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
ఇదేనిజం, హైదరాబాద్: బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్.. రన్నరప్ అమర్ దీప్ పై దాడికి పాల్పడ్డారు. దీంతో అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకున్నది. ప్రశాంత్ ను బిగ్ బాస్ విన్నర్ గా ప్రకటించడంతో అతడి ఫ్యాన్స్ భారీ సంఖ్యలో బిగ్ బాస్ హౌస్ వద్దకు చేరుకున్నారు. ప్రశాంత్ విజేత అని తెలియగానే సంబరాలు చేసుకున్నారు. ఈ క్రమంలో ఇరువురి అభిమానుల మధ్య మొదలైన వాగ్వాదం ఘర్షణకు దారితీసింది. ఒకరినొకరు తోసుకుంటూ, పిడిగుద్దులు గుద్దుకుంటూ అసభ్య పదజాలంతో దుర్భాషలాడుకున్నారు. అటుగా వెళ్తున్న కొండాపూర్-సికింద్రాబాద్ ఆర్టీసీ బస్సుపైనా దాడి చేసి, అద్దాన్ని పగలగొట్టారు. మరోవైపు హౌస్ నుంచి బయటకు వచ్చిన అమర్ దీప్ వాహనాన్ని చుట్టుముట్టారు. ముందుకు కదలనీయకుండా దాడిచేసే ప్రయత్నం చేశారు. కారు అద్దాలు పగలగొట్టి, అమర్‌ను బయటకు దిగమంటూ నినాదాలు చేశారు.