Homeహైదరాబాద్latest Newsచివరి దశకి చేరుకున్న 'బిగ్‌బాస్ సీజన్ 8'.. ఇకనుండి షో టైమింగ్స్‌లో మార్పు..!

చివరి దశకి చేరుకున్న ‘బిగ్‌బాస్ సీజన్ 8’.. ఇకనుండి షో టైమింగ్స్‌లో మార్పు..!

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 8 ప్రస్తుతం చివరిదశకు వచ్చేసింది. ప్రస్తుతం బిగ్‌బాస్ సీజన్ 14వ వారంలోకి అడుగుపెట్టింది. ఈ క్రమంలో బిగ్‌బాస్ తెలుగు గ్రాండ్ ఫినాలే తేదీ ఫిక్స్ అయింది. అలాగే బిగ్‌బాస్ షో టైమింగ్స్ లో కూడా మార్పులు చేశారు. బిగ్‌బాస్ తెలుగు 8 టెలికాస్ట్ టైమ్‌లో నేటి డిసెంబర్ 2 నుంచి మార్పు రానుంది.బిగ్‌బాస్ ఎపిసోడ్ రాత్రి 9 గంటలకు స్టార్ మా టీవీ ఛానెల్‌లో ప్రసారం అయ్యేది.. కానీ ఇక నుంచి బిగ్ బాస్ షో గంట తర్వాత రాత్రి 10 గంటలకు ప్రసారం కానుంది. ప్రస్తుతం బిగ్‌బాస్ హౌస్‌లో ప్రస్తుతం ఏడుగురు కంటెస్టెంట్స్ ఉన్నారు. ఈ హౌసులో అవినాష్, గౌతమ్ , నిఖిల్ , నబీల్ అఫ్రిది, ప్రేరణ కంబం, విష్ణుప్రియ మరియు రోహిణి ఉన్నారు. బిగ్‌బాస్ సీజన్ 8 తెలుగు గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ డిసెంబర్ 15న జరగనుంది.

Recent

- Advertisment -spot_img