బిగ్‌బాస్ తెలుగు సీజన్ 8 నిన్న నామినేషన్స్ ప్రక్రియతో మంచి జోరు అందుకుంది. తేజ vs నిఖిల్, పృథివి vs గౌతమ్ ఇలా వీరి నామినేషన్స్ తో నిన్నటి ఎపిసోడ్ హోరా హోరోగా సాగింది. అయితే తాజా ఓటింగ్‌లో అనూహ్య ఫలితాలు నమోదయ్యాయి. ప్రస్తుతం ఆ స్ట్రాంగ్ కంటెస్టెంట్ డేంజర్ జోన్‌లో ఉంది. ఓటింగ్‌లో గౌతమ్ అగ్రస్థానంలో దూసుకుపోతున్నాడు. ఆయనకు దాదాపు 25 శాతం ఓటింగ్ వచ్చింది. గౌతమ్ తర్వాత యష్మీ రెండో స్థానంలో ఉంది. ఆమెకు 21 శాతం ఓట్లు పోలయ్యాయి. పృథ్వీ 15 శాతం ఓట్లుతో మూడో స్థానంలో ఉన్నాడు. టేస్టీ తేజ 14 శాతం ఓట్లతో నాలుగో స్థానంలో ఉన్నారు. విష్ణుప్రియ, అవినాష్‌లు 13 శాతం ఓటింగ్‌తో చివరి రెండు స్థానాల్లో ఉన్నారు.స్ట్రాంగ్ కంటెస్టెంట్ విష్ణుప్రియ డేంజర్ ఉండడం అనూహ్య పరిణామం. విష్ణుప్రియ టాప్ సెలబ్రిటీ. ఆమెకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. తాజాగా ఓటింగ్‌లో ఆమె వెనుకబడడం గల కారణం ఎప్పుడూ ఇంట్లో పృథ్వీరాజ్ భజన చేయడమే… ప్రేక్షకులు కూడా ఆ ఆట తీరుని ఆదరించడం లేదు. ఈ వారం హౌస్ నుండి వీరిద్దరిలో ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారో చూడాలి.