బిగ్‌బాస్ తెలుగు సీజన్ 8 ప్రస్తుతం హోరా హోరీగా సాగుతుంది. ప్రస్తుతం 13వ వారం నామినేషన్స్ మొత్తం ఏడుగురు ఉన్నారు. ఈవారం 13 నామినేషన్లలో గౌతమ్‌తో పాటు నిఖిల్, ప్రేరణ, విష్ణుప్రియ, పృథ్వీ, టేస్టీ తేజ మరియు అవినాష్ ఉన్నారు. మెగా చీఫ్ కావడంతో జబర్దస్త్ రోహిణిని ఎవరూ నామినేట్ కాలేదు. ఈ వారం హౌస్ నుంచి ఆ టాప్ కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అవుతారని తెలుస్తుంది. ఓటింగ్ లో మొదటి రోజు నుంచి అత్యధిక ఓట్లతో గౌతమ్ మొదటి స్థానంలో ఉన్నాడు. రెండో స్థానంలో ప్రేరణ ఉన్నట్టు సమాచారం. నిఖిల్ మూడో స్థానంలో ఉన్నాడు. అయితే టేస్టీ తేజ నాలుగో స్థానంలో ఉన్నాడు. అవినాష్ ఐదో స్థానంలో, నబీల్ ఆరో స్థానంలో ఉండగా..చివరి రెండు స్థానాల్లో పృథ్వీ, విష్ణుప్రియ ఉన్నారు. ఈ క్రమంలో వీరిద్దరులో ఒకరు ఈ వారం ఎలిమినేట్ కాబోతున్నారు అని తెలుస్తుంది. అయితే ఈ సారి హౌసులో డబుల్ ఎలిమినేషన్ ఉందని సమాచారం. ఒకవేళ డబల్ ఎలిమినేషన్ కానీ జరిగితే హౌస్ నుండి పృథ్వీ, విష్ణుప్రియ లు ఎలిమినేట్ కానున్నారు అని తెలుస్తుంది. అయితే మరి ఈ వారంలో ఎవరు హౌస్ నుంచి బయటకు వెళ్తారని వేచి చూడాలి.