బిగ్‌బాస్ తెలుగు సీజన్ 8 చివరిదశకు వచ్చేసింది. ప్రస్తుతం బిగ్‌బాస్ సీజన్ 14వ వారం నడుస్తుంది. ఈ హౌసులో ప్రస్తుతం అవినాష్, గౌతమ్, నిఖిల్, నబీల్ అఫ్రిది, ప్రేరణ , విష్ణుప్రియ మరియు రోహిణి ఉన్నారు. ఈ వారంలో నామినేషన్‌లో మొత్తం ఆరుగురు ఉన్నారు. అయితే 14వ వారం ఓటింగ్ కూడా క్లోజ్ అయింది. ఈ నేపథ్యంలో ఈసారి బిగ్‌బాస్ విన్నర్ ఎవరు గెలవబోతున్నారో అనే విషయం వైరల్ అవుతుంది. అయితే ఓటింగ్ లో ఎప్పటికప్పుడు మార్పులు చోటుచేసుకోవడం గమనార్హం. అయితే చాలా మీడియా సంస్థలు అనధికారిక పోల్ నిర్వహించాయి వాటిలో గౌతమ్ మొదటి స్థానంలో నిలిచాడు. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన గౌతమ్ గత వారాల్లో టైటిల్ రేసులోకి రావడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.ఈ క్రమంలో బిగ్‌బాస్ ప్రేక్షకులు కూడా గౌతమ్ వైపే మొగ్గు చూపుతున్నారు. బిగ్‌బాస్ రన్నర్ గా నిఖిల్ రెండవ స్థానంలో ఉన్నాడు. ఈ సరి బిగ్‌బాస్ విన్నర్ గౌతమ్ అనే తెలుస్తుంది. అవినాష్ టికెట్ టు ఫినాలే గెలిచి టాప్ సిక్స్ లో మొదటి ఫైనలిస్ట్ గా నిలిచాడు. ప్రస్తుతం గౌతమ్, నిఖిల్, ప్రేరణ టాప్‌లో ఉండగా.. ఈ ముగ్గురు ఫైనల్‌లో కనిపించడం ఖాయం. రోహిణి నాలుగో స్థానంలో నిలిచింది. మరోవైపు విష్ణు ప్రియ ఐదో స్థానంలో నిలిచింది. నబీల్ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.ఈ ఇద్దరిలో ఒకరు ఈ వారం ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది.