Bihar : బీహార్‌లోని (Bihar) బెట్టియాలోని జిల్లా విద్యాశాఖాధికారి నివాసంపై విజిలెన్స్ బృందం దాడులు చేసింది. పశ్చిమ చంపారన్ జిల్లా విద్యాశాఖ అధికారి రజనీకాంత్ ప్రవీణ్‌కు చెందిన మూడు ప్రదేశాలపై విజిలెన్స్ ప్రత్యేక బృందం దాడులు చేసింది. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే విషయంలో ఆయన అవినీతికి పాల్పడ్డారని ఉపాధ్యాయ సంఘాలు కూడా ఆరోపించాయి. విజిలెన్స్ బృందం బెట్టియాలోని ప్రవీణ్ అద్దెకు తీసుకున్న నివాసం నుండి పెద్ద మొత్తంలో నగదును స్వాధీనం చేసుకుంది. ఈ ప్రాథమిక దర్యాప్తులో రూ.1.87 కోట్లకు పైగా ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్లు వెల్లడైంది. అయితే నోట్లను లెక్కించడానికి కోసం అధికారులు ఒక మిషన్ ను ఆర్డర్ చేశారు. ప్రవీణ్ దాదాపు మూడు సంవత్సరాలుగా బెట్టియాలో DEOగా పనిచేస్తున్నారు.