ఖమ్మం జిల్లా రూరల్ మండలంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటించారు. జలగంనగర్, కేబీఆర్ నగర్, టెంపుల్ సిటీ, నాయుడుపేట వరద ముంపు బాధితులను పరామర్శించారు. ఫోర్త్ క్లాస్ ఎంప్లాయిస్ కాలనీలోని వరద బాధితులను పరామర్శించడానికి టు వీలర్‌పై వెళ్లారు. ఈ క్రమంలో బైక్ ఒక్కసారిగా స్కిడ్ అయి పడిపోయారు. వెంటనే ఆయనను భద్రతా సిబ్బంది క్యాంప్ ఆఫీస్‌కు తరలించి ఫస్ట్ ఎయిడ్ చేశారు. ప్రథమ చికిత్స చేయించుకున్న తర్వాత ఆయన తిరిగి సహాయక చర్యల్లో పాల్గొన్నారు.