HomeజాతీయంBipin Rawat : కుప్పకూలిన బిపిన్‌ రావత్‌ ప్రయాణిస్తున్న ఆర్మీ హెలికాప్టర్

Bipin Rawat : కుప్పకూలిన బిపిన్‌ రావత్‌ ప్రయాణిస్తున్న ఆర్మీ హెలికాప్టర్

Bipin Rawat : కుప్పకూలిన బిపిన్‌ రావత్‌ ప్రయాణిస్తున్న ఆర్మీ హెలికాప్టర్

Bipin Rawat – తమిళనాడులోని ఊటి దగ్గర ఆర్మీ హెలికాప్టర్‌ కుప్పకూలింది.

ఈ హెలికాప్టర్‌లో చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ బిపిన్‌ రావత్‌తో పాటు మరో ముగ్గురు ఆర్మీ ఉన్నతాధికారులు ఉన్నట్టు చెబుతున్నారు.

హెలికాప్టర్‌ కూలిన తర్వాత మంటలు చెలరేగగా.. తీవ్ర గాయాల పాలైన ముగ్గురు అధికారులను ఆస్పత్రికి తరలించారు.

తమిళనాడులోని కూనూరులో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

ప్రమాదంలో హెలికాఫ్టర్ పూర్తిగా కాలిపోయింది.

వెంటనే అక్కడకు చేరుకున్న స్థానికులు మంటలను అదుపులోకి తీసుకుని వచ్చారు.

ఇప్పటి వరకు ముగ్గురిని రక్షించగా, నాలుగో వ్యక్తి కోసం గాలిస్తున్నారు.

ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా వారిని జిల్లాలోని వెల్లింగ్టన్ కంటోన్మెంట్‌కు తరలించారు.

ఆర్మీ, పోలీసు అధికారులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

Recent

- Advertisment -spot_img