Homeహైదరాబాద్latest NewsBird flu : మరోసారి బర్డ్ ఫ్లూ కలకలం.. 2 లక్షల కోళ్లు మృతి..!!

Bird flu : మరోసారి బర్డ్ ఫ్లూ కలకలం.. 2 లక్షల కోళ్లు మృతి..!!

Bird flu : తెలంగాణ రాష్ట్రంలో మరోసారి బర్డ్ ఫ్లూ (Bird flu) కలకలం రేపుతోంది. బర్డ్ ఫ్లూ వైరస్ కారణంగా లక్షలాది కోళ్లు చనిపోతున్నాయి. నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఏపూరు గ్రామపంచాయతీ పరిధిలోని కోళ్ల ఫారంలో రెండు లక్షలకు పైగా గుడ్లు ఉత్పత్తి చేస్తున్న కొన్ని కోళ్లకు బర్డ్ ఫ్లూ సోకింది. ఈ కోళ్ల ఫారంలో కోళ్లు మృత్యువాత పడుతుండడంతో పశువైద్య శాఖ అధికారులు వైద్య పరీక్షలు చేసారు. అయితే బర్డ్ ఫ్లూతో కోళ్లు చనిపోయినట్లు తేలింది. బర్డ్ ఫ్లూ సోకిన కోళ్ల ఫారమ్ చుట్టూ మూడు కిలోమీటర్ల ప్రాంతాన్ని వ్యాధి ప్రభావిత మండలంగా ప్రకటించారు. యాదాద్రి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం ధోతిగూడెంలో ఇటీవల కోళ్ల ఫారంలో వందలాది కోళ్లు మృత్యువాత పడ్డాయి. దీంతో అధికారులు సుమారు 40 వేల కోళ్లను పూడ్చిపెట్టారు. కోళ్ల ఫారంలోని దాణాను స్వాధీనం చేసుకున్నారు.

Recent

- Advertisment -spot_img