Bird Flu Symptoms: తెలుగు రాష్ట్రాలను బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది. లక్షల్లో కోళ్లు మృతిచెందగా.. మనుషులకు వ్యాపిస్తుందనే భయం నెలకొంది. ఇప్పటికే ఏలూరు జిల్లాలో ఒకరు బర్డ్ ఫ్లూ బారినపడ్డారు. బర్డ్ ఫ్లూ మనుషులకు సోకితే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం..
- బర్డ్ ఫ్లూ అనేది ఒక రకమైన వైరల్ ఇన్ఫెక్షన్
- ఈ వ్యాధి సంక్రమణ లక్షణాలు మొదట్లో సాధారణ ఫ్లూ మాదిరిగానే ఉన్నప్పటికీ.. ఇది కాలక్రమేణా మరింత తీవ్రమవుతుంది
- ఈ వ్యాధి సాధారణ లక్షణాలు అధిక జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, కండరాల నొప్పులు, శ్వాస ఆడకపోవడం
- కొన్ని తీవ్రమైన సందర్భాల్లో ఇది న్యుమోనియా, శ్వాసకోశ వైఫల్యానికి కారణమవుతుంది.
- బర్డ్ ఫ్లూ కి నిర్దిష్ట చికిత్స లేనప్పటికీ, ప్రాథమిక సంరక్షణ లక్షణాల నిర్వహణపై ఆధారపడి చికిత్స చేయవల్సి ఉంటుంది.