తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది. బర్డ్ ఫ్లూ రావడానికి అసలు కారణమిదేనని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అసలు ఆ కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. ఈ ఏడాది ఆస్ట్రేలియా నుంచి వలస పక్షులు కొల్లేరు సరస్సుతో పాటు ఇతర జలాశయాల్లోకి పెద్ద సంఖ్యలో వచ్చాయి. పక్షుల విసర్జన, ముక్కు నుంచి వచ్చే ద్రవం నీటితో పడితే బర్డ్ ఫ్లూ వైరస్ వ్యాప్తి చెందుతుంది. ఈ పక్షలు జలాశయాల్లో తిరిగి కోళ్ల ఫారాల వద్దకు వెళ్లడంతో వైరస్ వ్యాపిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. కాగా, బర్డ్ ఫ్లూకి వ్యాక్సిన్ లేదు. కోళ్ల ఫారాల వద్ద శుభ్రత పాటించాలి. వైరస్ వ్యాప్తిని కట్టడి చేయాలి.
- ALSO READ : పెన్షనర్లకు శుభవార్త.. ప్రభుత్వం కీలక నిర్ణయం..!