Former RBI Governor Raghuram Rajan has made key remarks on the recent surge in bitcoin. He likened the skyrocketing value of bitcoin to a bubble. He said it was a classic example of market trends.
ఇటీవల దూసుకుపోతున్న బిట్ కాయిన్‌పై ఆర్‌బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కీలక వ్యాఖ్యలు చేశారు.
బిట్ కాయిన్ విలువ విపరీతంగా పెరగడాన్ని ఆయన బుడగతో పోల్చారు. మార్కెట్ పోకడలకు సంబంధించి ఇదో క్లాసిక్ ఉదాహరణ అని అన్నారు.
ఓ జాతీయ ఛానెల్‌కు బుధవారం నాడు ఇచ్చిన ఇంటర్వూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ఓసారి మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని పరిశీలించండి.
గత ఏడాది మొదట్లో పది వేల డాలర్లుగా ఉన్న బిట్ కాయిన్ విలువ నేడు ఏకంగా 40 వేల డాలర్లకు చేరుకుంది.
వాస్తవంగా దీని వల్ల ఎటువంటి విలువా చేకూరదు. ఈ కరెన్సీ ద్వారా చెల్లింపులు చేయడం కూడా కష్టమే.
కానీ, బిట్ కాయిన్ విలువ 40 వేల డాలర్లకు చేరుకుంది. భవిష్యత్తులో దీని విలువ మరింత పెరుగుతుందని మదుపర్లు నమ్ముతున్నారు కాబట్టే బిట్ కాయిన్‌పై ఆసక్తి నానాటికీ పెరిగిపోతోంది.
ఈ వైఖరి ఓ బుడగ లాంటిది’ అని ఆయన వ్యాఖ్యానించారంటూ ఈ వార్తలో రాశారు.