Homeతెలంగాణbjp:కాషాయం.. కకావికలం

bjp:కాషాయం.. కకావికలం

కాషాయం.. కకావికలం

  • బయటపడుతున్న అసమ్మతి
  • నేతల్లో నైరాశ్యం
  • అక్కడక్కడా తిరుగుబాట్లు
  • సొంతపార్టీపైనే రాములమ్మ విమర్శలు
  • ఎంపీ అర్వింద్ పై తిరుగుబాటు

ఇదే నిజం, స్టేట్ బ్యూరో: తెలంగాణ బీజేపీశాఖలో క్రమంగా అసమ్మతి బయటపడుతోంది. రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి బాధ్యతలు చేపట్టాక ఆ పార్టీలో ఊపు కూడా తగ్గిపోయింది. మరోవైపు బండి సంజయ్ ను తప్పించడం పట్ల బీసీ నేతలు తీవ్ర అసహనంగా ఉన్నారు. దీనికి తోడు పార్టీలో క్రమంగా అసమ్మతి వెలుగులోకి వస్తున్నది. ఇప్పటికే బీజేపీపై ఆ పార్టీ మహిళా నేత విజయశాంతి విమర్శలు గుప్పించారు. మణిపూర్ అల్లర్లపై ఆమె స్పందించారు. మరికొందరు నేతలు సైతం పార్టీపై తీవ్ర అసహనంగా ఉన్నట్టు సమాచారం.

తెరపైకి బీసీ నినాదం..
బండి సంజయ్ ను రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పించడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. బీసీ లీడర్ ను ఎందుకు పక్కకు పెట్టారని సొంత పార్టీ నేతలే ఆరోపణలు గుప్పించారు. వచ్చే ఎన్నికల్లో బీసీని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలన్న డిమాండ్ సైతం తెరమీదకు వచ్చింది. బీజేపీ, బీఆర్ఎస్ జాతీయ స్థాయిలో ఒప్పందం కుదుర్చుకున్నాయన్న వార్త జనంలోకి బలంగా వెళ్లింది. దీనికి తోడు కర్ణాటక ఎన్నికల ఫలితాల అనంతరం బీజేపీ కార్యక్రమాలు కూడా క్రమంగా తగ్గాయి. బీజేపీ ఎంపీ అర్వింద్ పై సొంతపార్టీకి చెందిన లీడర్లు తిరుగుబాటు చేశారు.

హైకమాండ్ రంగంలోకి దిగుతుందా?
ప్రస్తుతం కిషన్ రెడ్డి.. కేంద్ర మంత్రిగా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. దీంతో ఆయన పూర్తిగా రాష్ట్రం మీదే ఫోకస్ పెట్టలేకపోతున్నారు. కాంగ్రెస్ పార్టీ సైతం నిత్యం ఏదోరకంగా వార్తల్లో నిలుస్తోంది. ప్రజా సమస్యలపై పోరాడుతోంది. బీఆర్ఎస్ నేతలు సైతం బీజేపీని కాకుండా బీఆర్ఎస్ మీదే విమర్శలు గుప్పిస్తున్నారు. దీంతో రాష్ట్రంలో కాంగ్రెస్ x బీఆర్ఎస్ మధ్యే పోటీ నెలకొన్నది. మరి ఈ పరిస్థితిని అధిష్ఠానం చక్క దిద్దుతుందా? అన్నది వేచి చూడాలి.

Recent

- Advertisment -spot_img