Homeఎడిటోరియల్​BJP:కవిత అరెస్ట్ డిమాండ్ చేస్తున్న ఈటల , రాజగోపాల్ రెడ్డి-ఢిల్లీకి బండి సంజయ్ ..

BJP:కవిత అరెస్ట్ డిమాండ్ చేస్తున్న ఈటల , రాజగోపాల్ రెడ్డి-ఢిల్లీకి బండి సంజయ్ ..

BJP:అసలు ఏం జరుగుతోంది ? బీజేపీ అధిష్టానం తెలంగాణాలో బీజేపీ అధికారం లోకి రావడానికి వేస్తున్న ఎత్తులేంటి ?. కాంగ్రెస్ గంతులేస్తుండగా ,బీజేపీ మౌనంగా ఉండటానికి కారణమేంటి?. రాజకీయవర్గాల్లో ఇప్పుడు ఇది ఆసక్తికరమైన చర్చ. బీజేపీకి అనుకూలంగా ఉన్న రాజకీయాలు అకస్మాత్తుగా ఇలా ఎందుకు మారాయనే విషయం మీద బీజేపీ తలలు పట్టుకుంటున్నది . ప్రస్తుత బీజేపీ వ్యవహారం కాంగ్రెస్ గెలుపుకు దోహదం చేస్తున్నట్లు ఉంది , బీఆర్ఎస్ ను ఖతం పట్టించి, బీజేపీ జెండాను తెలంగాణ లో ఎగురవేస్తామని చెప్పిన తెగువ బీజేపీ లో అంతర్ధానమైంది . ఇప్పుడు బీజేపీ అనుసరిస్తున్న విధానం కాంగ్రెస్ కు ప్లస్ అవుతున్నది . కర్ణాటకలో గెలిచి ఊపు మీదున్న కాంగ్రెస్ కు బీజేపీ వ్యవహారం మరింత బలాన్నిస్తోంది .

ఇప్పటికే ఢిల్లీలోనే మకాం వేసి ఉన్నారు ఈటల రాజేందర్ , రాజగోపాల్ రెడ్డి. ఇప్పుడు తాజాగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్ కూడా అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది. బండి సంజయ్‌ ఢిల్లీ టూర్‌తో అసలు ఢిల్లీలో ఏం జరుగుతుందో నని చర్చించుకుంటున్నారు. అసంతృప్తి నేతల చర్చల తర్వాత ఢిల్లీ పర్యటనపై ఆసక్తి నెలకొంది. ఈటల రాజేందర్ , రాజగోపాల్ రెడ్డి అలక వెనుక ఉన్న ఆంతర్యమేంటి ? అసంతృప్తి దేనికోసం ? అసలు వీరి డిమాండ్లు ఏంటి? అనేది స్పష్టమైందని చెప్పాలి . లిక్కర్ కేసులో ఆరోపణలు ఎదుర్కుంటున్న కవితని తక్షణమే అరెస్ట్ చేయాలని , అవినీతిని వెలికి తీసి కెసిఆర్ లేదా కేటీఆర్ ను జైల్లోకి పంపడం ద్వారానే బీఆర్ఎస్ కు ధీటుగా బీజేపీ నిలిచి గెలుస్తుందని చెప్పినట్లు తెలిసింది.

ఇప్పటికిప్పుడు కవిత ను అరెస్ట్ చేయాలని ఈటెల, రాజగోపాల్ రెడ్డి డిమాండ్ చేసినట్లు తెలిసింది . అందులో భాగంగానే నాగర్ కర్నూల్ సభలో నడ్డా మాట్లాడుతూ కేసీఆర్ ను జైల్లో పెడతామని చెప్పడం సంకేతమని చర్చ జరుగుతోంది . అసంతృప్తి నేతల చర్చల తర్వాత బండి సంజయ్‌కు ఢిల్లీ నుంచి పిలుపు రావడం.. ఆయన కూడా ఢిల్లీ పర్యటన వెళ్లడంపై ఆసక్తి నెల కొంది. నిన్నటి తెలంగాణ పర్యటనలో బండి నాయకత్వంపై నడ్డా పొగడ్తలు వర్ష కురిపించడం.. అంతకు ముందు రోజు ఢిల్లీలో అసంతృప్తి నేతలు ఈటల, రాజగోపాల్ రెడ్డిలకు బుజ్జగింపు జరపడం.. వరుస పరిణామాల నేపథ్యంలో ఏదో జరుగుతుందని ఇంటా, బయట చర్చ జరుగుతోంది.

Recent

- Advertisment -spot_img