HomeజాతీయంBJP, BRS కలిసే పనిచేస్తున్నయ్

BJP, BRS కలిసే పనిచేస్తున్నయ్

– రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్

ఇదే నిజం, హైదరాబాద్: తెలంగాణలో బీజేపీ, బీఆర్ఎస్ కలిసి పనిచేస్తున్నాయని రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గెహ్లాట్ తెలిపారు. హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటు బీఆర్ఎస్ పాలన చూస్తే పరీక్ష పేపర్ల లీక్‌.. అటు కేంద్రంలో మోడీ పాలనంతా ఆర్థిక నేరాల మయంగా మారిందని విమర్శించారు. ‘బడా వ్యాపారులు బ్యాంకుల్లో అప్పులు చేసి విదేశాలకు పారిపోయారు. వారు ఎగవేసిన కోట్ల అప్పులను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మాఫీ చేసింది. దేశంలోని సంపదనంతా దోచుకునే పార్టీలు ఒకవైపు ఉంటే.. కాంగ్రెస్‌ మాత్రమే ప్రజల పక్షాన ఉంది. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే మేనిఫెస్టోలో ప్రకటించిన ఆరు గ్యారంటీలను అమలు చేస్తుంది’అని గెహ్లాట్ తెలిపారు.

Recent

- Advertisment -spot_img