Homeతెలంగాణఅసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ చెప్పిన‌వన్నీ అబద్దాలేః బండి సంజయ్

అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ చెప్పిన‌వన్నీ అబద్దాలేః బండి సంజయ్

హైద‌రాబాద్ః కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన విద్యుత్ సవరణ చట్టంపై సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా చెప్పిన‌వ‌న్నీ అబద్దాలేన‌ని బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. కేవ‌లం ముసాయిదాను ఆధారం చేసుకుని రాజకీయం చేశారని, ఉద్యోగులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకిచ్చిన హామీలను గాలికి వదిలేసిందని సంజ‌య్‌ నిప్పులు చెరిగారు. ఇక నుండి ప్రజాక్షేత్రంలో టిఆర్ఎస్ పార్టీని నిలదీసే కార్యక్రమం చేపడతామని ఆయన తెలిపారు. ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చకుండా, ప్రతి హామీ విషయంలో కేంద్ర సహకారం లేదంటూ ఆరోపిస్తున్నారని కేసీఆర్ పై మండిపడ్డారు. పాతబస్తీలో జరుగుతున్న విద్యుత్ చౌర్యం పై, లక్షల రూపాయలలో ఉన్న విద్యుత్ బకాయిలపై సీఎం కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదంటూ ఆయన ప్రశ్నించారు.
జ‌గ‌న్‌కు లేని ఇబ్బంది మీకెందుకు?
కేసీఆర్ సీఎం హోదాలో ఉండి ఈ తరహా రాజకీయాలు చేయడం, అబద్ధాలు మాట్లాడడం సిగ్గుచేటన్నారు. కొత్త విద్యుత్ సవరణ చట్టంపై ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి లేని ఇబ్బంది కేసీఆర్ కి ఎందుకు వచ్చింది అంటూ సంజ‌య్‌ ప్రశ్నించారు. మరోమారు సీఎం జగన్మోహన్ రెడ్డిని భోజనానికి పిలిచి ఆయన ద్వారా తెలుసుకోవాలంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కేంద్రం పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టక ముందే దాన్ని వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం ఎలా చేస్తారో చెప్పాలని ఆయన కేసీఆర్ ను నిలదీశారు. కొత్త విద్యుత్ సవరణ చట్టంతో ఉద్యోగాలు పోతాయో చెప్పాలని కూడా ప్రశ్నించారు బండి సంజయ్. రాష్ట్రంలో రైతులకు ఉచిత విద్యుత్ పేరుతో భారీ దోపిడీ జరుగుతోందని, సామాన్య రైతులకు లబ్ది చేకూరటం లేదని బండి ఆరోపించారు.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img