Homeహైదరాబాద్latest News‘బీజేపీ ఉగ్రవాదుల పార్టీ’.. మా గురించి మాట్లాడే అర్హత మోదీకి లేదు : మల్లికార్జున ఖర్గే

‘బీజేపీ ఉగ్రవాదుల పార్టీ’.. మా గురించి మాట్లాడే అర్హత మోదీకి లేదు : మల్లికార్జున ఖర్గే

బీజేపీ ఉగ్రవాదుల పార్టీ అని.. ప్రధాని మోదీపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్ర విమర్శలు చేశారు.జమ్మూ కాశ్మీర్, హర్యానా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఇటీవలే పూర్తయ్యాయి. అదే విధంగా మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాలకు త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఎన్నికల ప్రచారంలోనూ, ఆయన పాల్గొనే కార్యక్రమాల్లోనూ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పిస్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అర్బన్ నక్సల్స్ పార్టీ. అర్బన్ నక్సలైట్లు పార్టీని నడుపుతున్నారని మోదీ ఉన్నారు. మహారాష్ట్రలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇక 5వ తేదీన మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతంలోని వాషిమ్ ప్రాంతంలో ప్రధాని మోదీ మాట్లాడుతు.. ‘‘అర్బన్ నక్సల్స్ కాంగ్రెస్ పార్టీని శాసిస్తున్నారు. వారి దుష్ట విధానాలను తిప్పికొట్టేందుకు ప్రజలంతా ఏకం కావాలి’’ అని అన్నారు.
దీనిపై బీజేపీ తీవ్రవాదుల పార్టీ అని కాంగ్రెస్‌ నేత మల్లికార్జున ఖర్గే తీవ్ర స్థాయిలో విమర్శించారు. దీనిపై మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ పార్టీని మోదీ ఎప్పుడూ అర్బన్‌ నక్సల్స్‌గా పేర్కొంటారు. ఇదే అతడికి అలవాటుగా మారింది. అయితే ఆయన పార్టీ బీజేపీ సంగతేంటి? బీజేపీ ఉగ్రవాదుల పార్టీ. హత్యలకు పాల్పడుతున్నారు. అలాంటి పార్టీ నుంచి మా గురించి మాట్లాడే అర్హత మోదీకి లేదన్నారు.

Recent

- Advertisment -spot_img