Homeఫ్లాష్ ఫ్లాష్bjp leader: బీజేపీ మహిళా నేత మిస్సింగ్​

bjp leader: బీజేపీ మహిళా నేత మిస్సింగ్​

  • మహారాష్ట్రలో కలకలం

bjp leader: ఇదేనిజం, నేషనల్​ బ్యూరో: బీజేపీకి చెందిన ఓ మహిళా నేత కనిపించకుండా పోవడం ఇప్పుడు కలకలం రేపుతోంది. మహిళా నేత సనాఖాన్​ ది మహారాష్ట్రలోని నాగ్​ పూర్​. ఆమె తన బిజినెస్ పార్ట్నర్ అమిత్ అలియాస్ పప్పు సాహును కలవడానికి 2023 ఆగస్టు 1న జబల్‌పూర్ వెళ్లారు. అప్పటి నుంచి సనా కనిపించడం లేదు.

దీంతో సనా ఖాన్ తల్లి మాన్కాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు పప్పు సాహు కూడా కనిపించకుండా పోయాడు. జబల్‌పూర్‌కు చెందిన కరుడుగట్టిన నేరస్థుడు పప్పు సాహు .. జబల్‌పూర్‌లో అతను దాబా నడుపుతున్నాడు అతనిపై హత్యతో సహా మద్యం అక్రమ రవాణా కేసులు ఉన్నాయి.

అయితే ఒక నెల క్రితం సనా ఖాన్ ను చంపేస్తానంటూ ఫోన్ లో బెదిరించాడు. ఆగస్టు 1న అతని నుంచి సనాకు ఫోన్ రావడంతో జబల్‌పూర్‌కు బయలుదేరింది. అక్కడికి చేరుకున్న తన తల్లికి ఫోన్ చేసి మాట్లాడింది. అయితే తిరిగి సాయంత్రం ఫోన్ చేస్తే మాత్రం స్విచ్ఛాఫ్‌ అని వచ్చింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.

Recent

- Advertisment -spot_img