ఇదే నిజం, ముస్తాబాద్: ముస్తాబాద్ మండల కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని బిజెపి మండల అధ్యక్షులు మెరుగు అంజా గౌడ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కు వినతిపత్రం అందించారు. బిజెపి నాయకులు మంత్రి రెడ్డి విన్నవించుకుంటూ మండలంలోని డిగ్రీ కళాశాల లేక ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులు దూర ప్రాంతాలకు వెళ్లి డిగ్రీ చేసే పరిస్థితి ఉందని, అలాగే కొంతమంది విద్యార్థులు దూరప్రాంతాలకు వెళ్లలేక చదువును మధ్యలోనే మానేస్తున్నారని చదువులకు వెళ్లలేక, గతంలో డిగ్రీ కళాశాల గురించి భారతీయ జనతా పార్టీ ‘బిజెపి యువమోర్చా’ ఆధ్వర్యంలో అనేకసార్లు ధర్నాలు చేశామని గత ప్రభుత్వం కక్ష సాధింపుగా బిజెపి నాయకుల పైన అక్రమ కేసులు పెట్టారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు చిట్నేని శ్రీనివాస్ రావు, కోల కృష్ణగౌడ్,బాద నరేష్,చీకోటి మహేష్, రమేష్ గౌడ్,దీటి సత్తయ్య, ఆకాష్ పాల్గొన్నారు.