అటల్ బిహారి వాజ్‌పేయి నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఒక్క ఓటు తేడాతో కేంద్రంలో అధికారాన్ని కోల్పోవాల్సి వచ్చింది. ప్రభుత్వాన్ని నడపడానికి తగిన మద్దతు ఉందంటూ 1999 ఏప్రిల్ 17న బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం లోక్‌సభలో విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. మిత్రపక్షం అన్నాడీఎంకే మద్దతు ఉపసంహరించుకోవడంతో తీర్మానం వీగిపోయి ఒక్క ఓటుతో అధికారాన్ని కోల్పోవాల్సి వచ్చింది. దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు ..ఒక్క ఓటు విలువ ఏంటనేది. ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకుండా భారత రాజ్యాంగం మీకు కల్పించిన హక్కును సరిగా వినియోగించుకొని పౌరుడిగా బాధ్యతగా నిర్వర్తించండి. ఇతరులకు ఆదర్శంగా ఉంటూ దేశాభివృద్ధికి సహకరించిన వారవుతారు. మర్చిపోవద్దు.