– అధిష్ఠానం ఫిక్స్ చేసిన ఎమ్మెల్యే ఆయనే..
బీజేపీ శాసనసభాపక్ష నేత పోస్ట్ చాలా రోజులుగా పెండింగ్ లో పడిపోయిన విషయం తెలిసిందే. ఈ పోస్టు కోసం పార్టీలో తీవ్ర పోటీ నెలకొన్నది. ఎమ్మెల్యేలు రాజాసింగ్, వెంకటరమణారెడ్డి, ఏలేటి మహేశ్వర్ రెడ్డి పేర్లు బలంగా వినిపించాయి. అయితే తాజాగా అధిష్ఠానం ఈ పోస్టు విషయంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి పేరు హైకమాండ్ ఫిక్స్ చేసింది. ప్రస్తుతం నిర్మల్ ఎమ్మెల్యేగా ఉన్న ఏలేటి మహేశ్వర రెడ్డి.. 2009లో ప్రజారాజ్యం పార్టీలో ఎమ్మెల్యేగా పనిచేశారు. కాగా అసెంబ్లీ బీఏసీ సమావేశానికి 8 మంది బీజేపీ ఎమ్మెల్యేల్లో ఒకరిని పిలవాలని ఆ పార్టీ శాసనసభ్యులుస్పీకర్‌ను కోరారు.