ఇదే నిజం, వట్ పల్లి: వట్ పల్లి మండల కేంద్రంలోని పల్వట్ల గ్రామంలో సోమవారం బీజేపీ సభ్యత్వం నమోదు కార్యక్రమాన్ని అందోల్ నియోజకవర్గం ఇంచార్జ్ పల్వాట్ల జగదీశ్వర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న రోజుల్లో రాష్ట్రంలో సైతం ప్రధాన పాత్ర పోషిస్తుందని అన్నారు. పార్టీ శ్రేణులు పార్టీ సభ్యత్వాన్ని పెద్ద ఎత్తున నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయకులు, మంఠం చంద్రశేఖర్, అరవింద్, ప్రభాకర్, విట్టల్ రావు, చాకలి మల్లయ్య, తదితర బిజెపి నాయకులు పాల్గొన్నారు.