బీహార్లో విజయదశమి వేడుకల సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యే మిథిలేష్ కుమార్ బాలికలకు కత్తులు పంపిణీ చేశారు. ఈ ఘటన బీహార్లోని సీతామర్హి జిల్లాలో చోటుచేసుకుంది. విజయదశమి కార్యక్రమాలకు వచ్చిన పాఠశాల, కళాశాల విద్యార్థులకు కత్తులు పంపిణీ చేశారు. ‘ఏ దుర్మార్గుడైనా మన సోదరీమణులను తాకడానికి సాహసిస్తే ఈ కత్తితో అతని చేయి నరికి వేయండి’ అంటూ ఎమ్మెల్యే మిథిలేష్ కుమార్ కత్తులు పంచారు. వేధించే వారి చేతులు నరికివేసే శక్తి అక్కాచెల్లెళ్లకు రావాలని, అవసరమైతే మీరు, తనూ అలాగే చేయాలని ఆయన అన్నారు. వేధించేవారి చేతులు నరికే అధికారం అక్కాచెల్లెళ్లకు రావాలని,అవసరమైతే మీరు, తనూ అలాగే చేయాలని ఆయన అన్నారు.