ఇటీవల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీల్లో మహాలక్ష్మీ పథకం కింద మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించిన విషయం తెలిసిందే. అయితే కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఉచిత బస్సు సౌకర్యంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
నెలకు రూ.10 వేలు ఆదాయం ఉన్నా ఫ్రీ బస్సు సౌకర్యాన్ని వినియోగించుకుంటే మహిళలు తమ దృష్టిలో బిచ్చగాళ్లలాంటి వాళ్లని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఆదాయం, ఆస్తులు భారీగా ఉన్నా పింఛన్, రైతు పెట్టుబడి సాయం, రేషన్ కార్డు తీసుకున్న వాళ్లంతా బిచ్చగాళ్లే అన్నారు. ప్రస్తుతం ఫ్రీ బస్సు సౌకర్యం విషయంలో ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.