బీజేపీ ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి మానవత్వం చాటుకున్నారు. రాజమహేంద్రవరంలో రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ తీవ్రంగా గాయపడింది. అది గమనించి వెంటనే తన వాహనాన్ని నిలిపివేశారు. ఎస్కార్ట్ వాహనంలో క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి ఫోన్ చేసి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.