ఏప్రిల్ లోపు BJP జాతీయ అధ్యక్షుడి ఎన్నిక పూర్తవుతుందని ఆ పార్టీ ఎంపీ డా.లక్ష్మణ్ అన్నారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ‘బీఆర్ఎస్ అనేది గత చరిత్ర. రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా బీజేపీ ఎదిగింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ముగ్గురు అభ్యర్థులను పోటీలో పెట్టిన ఏకైక పార్టీ తమది. గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ మోసం చేసింది. ప్రజలను ఆర్థికంగా శక్తిమంతం చేయడమే ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యం’ అని అన్నారు.