– 12 మంది అభ్యర్థులతో జాబితా
– మునుగోడు టికెట్ చల్లమల్లకు
– ఈటల అనుచరురాలు తుల ఉమకు వేములవాడ టికెట్
ఇదేనిజం, తెలంగాణ బ్యూరో: బీజేపీ మూడో జాబితా విడుదలైంది. మొత్తం 12 మంది అభ్యర్థులో లిస్ట్ వచ్చేసింది. ఇటీవల బీజేపీలో చేరిన చల్లమల్ల కృష్ణారెడ్డికి మునుగోడు టికెట్ దక్కింది. ఇక ఈటల అనుచరురాలు తుల ఉమకు వేములవాడ టికెట్ లభించింది. ఈ టికెట్ ను మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు కుమారుడు వికాస్ రావు ఆశించారు. అయినప్పటికీ తుల ఉమకే టికెట్ దక్కడం గమనార్హం.
నియోజకవర్గం అభ్యర్థి పేరు
చెన్నూరు దుర్గం అశోక్
ఎల్లారెడ్డి సుభాష్‌రెడ్డి
హుస్నాబాద్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి
సిద్దిపేట దూది శ్రీకాంత్‌రెడ్డి
వికారాబాద్ పెద్దింటి నవీన్‌కుమార్
కొడంగల్ బంటు రమేశ్‌కుమార్
గద్వాల్ బోయ శివ
మిర్యాలగూడ సాధినేని శివ
మునుగోడు చల్లమల్ల కృష్ణారెడ్డి
నకిరేకల్ మొగులయ్య
ములుగు అజ్మీరా ప్రహ్లాద్ నాయక్
వేములవాడ తుల ఉమ