బీజేపీ ఎంపీ నవనీత్ కౌర్ వ్యాఖ్యలు వైరల్ అయిన వేళ తెలంగాణ బీజేపీ దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. పార్టీకి నష్టం జరగకుండా ఉండేందుకు ముస్లింలకు తాము వ్యతిరేకం కాదంటూ సోషల్ మీడియాలో ఓ వీడియో రిలీజ్ చేశారు. ట్రిపుల్ తలాక్ రద్దు, జమ్మూ కశ్మీర్ ఉగ్రవాద సమస్య, ముద్ర రుణాల మంజూరు తదితర అంశాలను జతచేసి ముస్లింలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.
హైదరాబాద్ లోక్‌సభ అభ్యర్థి మాధవీలతకు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎంపీ నవనీత్ కౌర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 15 సెకన్లు పోలీసులను పక్కకు జరగమంటే దేశంలో ముస్లింలు ఉండరంటూ ఎంపీ అక్బరుద్దీన్ ఒవైసీని ఉద్దేశించి హెచ్చరించారు.