Homeతెలంగాణbjp vs trs:బీజేపీ, బీఆర్ఎస్​ వర్గీయులు ఘర్షణ

bjp vs trs:బీజేపీ, బీఆర్ఎస్​ వర్గీయులు ఘర్షణ

– పలువురికి తీవ్ర గాయాలు
– ఎమ్మెల్యే విజయ్‌భాస్కర్‌ ఇంటి ముట్టడికి బీజేపీ యత్నం
– అడ్డుకున్న బీఆర్ఎస్​ శ్రేణులు

ఇదేనిజం, హన్మకొండ: బీజేపీ, బీఆర్ఎస్​ శ్రేణుల మధ్య ఘర్షణ జరిగింది. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వరంగల్​ జిల్లా హన్మకొండలో ఈ ఘటన చోటు చేసుకున్నది. వరంగల్‌ పశ్చిమ ఎమ్మెల్యే విజయ్‌భాస్కర్‌ క్యాంపు కార్యాలయం ముట్టడికి బయలుదేరిన బీజేపీ నాయకులు, కార్యకర్తలను బీఆర్ఎస్​ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాల కార్యకర్తలు రాళ్లు, కర్రలతో పరస్పరం దాడులకు పాల్పడ్డారు. దీంతో కొంత మంది బీజేపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. అనంతరం బీజేపీ హనుమకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మను పోలీసులు బలవంతంగా వాహనంలోకి ఎక్కించేందుకు ప్రయత్నించగా.. ఆమె సొమ్మసిల్లి కింద పడిపోయారు. పోలీసులు ఆమెను చికిత్స నిమిత్తం హనుమకొండలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img