– పార్టీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి
ఇదే నిజం, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ కార్యకర్తలంతా ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు. హైదరాబాద్ నాంపల్లిలోని పార్టీ స్టేట్ ఆఫీసులో కిషన్ రెడ్డి సమక్షంలో చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కె.ఎస్. రత్నం బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో కాషాయజెండా ఎగురవేయాలని అన్నారు. ‘తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షల మేరకు పని చేద్దాం. దేశంలో కుటుంబ పాలనకు చరమగీతం పాడాలి. కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ బీ టీమ్‌గా ఉంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పార్టీలకు ఏ టీమ్ ఎంఐఎం. బీజేపీ తెలంగాణ ప్రజల టీమ్. అధికారం శాశ్వతం కాదు.. ప్రతిపక్షంలో కూర్చోవడానికి బీజేపీ సిద్ధంగా ఉంది. రాష్ట్ర ప్రజల ఆకాంక్షల మేరకు అందరూ కలిసి పని చేయాలి. బీజేపీకి ఒక్క అవకాశం ఇవ్వాలి. మేం అధికారంలోకి వస్తే ఉచిత విద్య, వైద్యం అందిస్తాం’అని కిషన్‌రెడ్డి తెలిపారు