ఎన్నికల ప్రచారంలో బిజీబిజీగా ఉంటోన్న నాయకులకు సోషల్ మీడియాలో వస్తోన్న కొన్ని వీడియోలు తలనొప్పిగా మారుతుండగా..మరికొందరికి సూపర్ కిక్ ఇస్తున్నాయి.
ఇవాళ ( మే 8) కాంగ్రెస్ పార్టీపై ” ఈ గుంపుకు నేనే మేస్తిరి, వేసేస్తా రైతుకి నే ఉరి!! ” అని రేవంత్ రెడ్డి అన్నట్లుగా ఉన్న క్యాప్షన్‌తో BJP క్రియేట్ చేసిన ఓ వీడియో ప్రస్తుతం ట్విటర్‌లో వైరల్ అవుతోంది.
మెగాస్టార్ చిరంజీవి నటించిన ముఠామేస్త్రి సినిమాలోని ఈ పేటకు నేనే మేస్త్రి అనే సాంగ్‌ను సేమ్ మ్యూజిక్‌తో లిరిక్స్ చేసి సెటైరికల్ సాంగ్ క్రియేట్ చేశారు.
కులం పేరుతో దేశాన్ని విడగొడతామని, పేదలను మరింత దారిద్రంలోకి తీసుకెళ్తామని కాంగ్రెస్ పేరుతో సెల్ఫ్ వీడియో క్రియేట్ చేశారు.
రాహుల్ గాంధీ డ్యాన్స్, రేవంత్ రెడ్డి కర్రసాము వంటి క్లిప్స్‌ను యాడ్ చేసి వీడియోను హైలైట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో ట్రెండింగ్‌లో ఉంది. మీరూ చూసేయండి మరి.