Homeఫ్లాష్ ఫ్లాష్Onions : ఉల్లిగడ్డలతో బ్లాక్‌ఫంగస్‌ వస్తుందా..

Onions : ఉల్లిగడ్డలతో బ్లాక్‌ఫంగస్‌ వస్తుందా..

‘ఉల్లిగడ్డలు వాడేప్పుడు జాగ్రత్తగా ఉండండి. వాటి పొరల మీద నల్లగా ఉండే ఫంగస్‌తో బ్లాక్‌ఫంగస్‌ రావొచ్చు’ అంటూ సామాజిక మాధ్యమాలలో ఒక వార్త చక్కర్లు కొడుతున్నది.

కూరలను ఫ్రిజ్‌లో నిల్వ ఉంచితే వాటిమీద ఏర్పడే బ్యాక్టీరియా కూడా ప్రమాదకరమేనని, ఫ్రిజ్‌లో నీళ్లబాటిళ్లు, కూరగాయలు పెట్టే చోట నల్లగా పేరుకుపోయిన బ్యాక్టీరియా కూడా బ్లాక్‌ ఫంగస్‌కు దారి తీయవచ్చు అనే పోస్టు సోషల్‌ మీడియాలో విస్తృతంగా షేర్‌ అవుతున్నది.

ఇదంతా తప్పుడు ప్రచారమని ఆలిండియా మెడికల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌) తెలిపింది.

కూరగాయలు, వస్తువుల ద్వారా బ్లాక్‌ ఫంగస్‌ రాదని స్పష్టం చేసింది. ఉల్లిగడ్డల మీద కనిపించే నల్లని పొర భూమిలో ఉండే ఫంగస్‌ వల్ల ఏర్పడుతుంది.

అది బ్లాక్‌ ఫంగస్‌కు దారి తీయదు. ఇక ఫ్రిజ్‌లో ఏదైనా ఎక్కువరోజులు నిల్వ ఉంచితే అందులో ఉండే ఉష్ణోగ్రత కారణంగా అందులో బ్యాక్టీరియా ఏర్పడుతుంది.

ఇది కూడా మ్యూకోర్మైకోసిస్‌కు కారణం కాదని ఎయిమ్స్‌ డైరెక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా తెలిపారు.

ఢిల్లీలో తొలిసారిగా గుర్తింపు.. చికిత్స

దేశ రాజధానిలోని సర్‌ గంగారాం దవాఖానలో వైట్‌ ఫంగస్‌ లక్షణాలతో చేరిన ఒక మహిళ పెద్ద పేగులో చిల్లులు పడ్డట్లు వైద్యులు గుర్తించారు.

కడుపులో నొప్పి, విరేచనాల వంటి లక్షణాలతో ఢిల్లీకి చెందిన ఒక మహిళ (49) మే 13న గంగారాం దవాఖానలో చేరారు.

గతేడాది డిసెంబర్‌లో ఆమెకు రొమ్ము క్యాన్సర్‌ ఆపరేషన్‌ జరుగగా, నాలుగు వారాల క్రితమే కీమో థెరపీ కూడాఅయింది.

అయితే ఆమె దవాఖానలో చేరిన తర్వాత సీటీ స్కాన్‌ చేయగా పెద్ద పేగుకు చిల్లులు పడ్డట్టు తేలింది.

దీంతో వెంటనే చికిత్స ప్రారంభించిన వైద్యులు.. ఆమె ఉదర భాగంలో గొట్టం ద్వారా పేగులో ఉన్న చీమును తీసివేసి చిల్లులను మూసేశారు.

ప్రస్తుతం ఆమె ఆరోగ్యంగానే ఉందని వెల్లడించారు.

Recent

- Advertisment -spot_img