ఇదేనిజం, శేరిలింగంపల్లి: చేవెళ్ళ పార్లమెంట్ నియోజక వర్గం మరింత అభివృద్ధి చెందాలంటే మరొక్క సారి ఆశీర్వదించాలని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రంజిత్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం ఉదయం కొండాపూర్ డివిజన్ పరిధిలోని అమర్ సొసైటీలో అన్న పలు కాలనీ అసోసియేషన్ సభ్యులతో అల్పాహార విందులో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వి.జగదీశ్వర్ గౌడ్ తో కలిసి ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. చేవెళ్ళ నియోజక వర్గం మరింత అభివృద్ధి చెందాలంటే మరొక్క సారి ఆశీర్వదిస్తే కాలనీలలో ఉన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. పదేళ్ల బీజేపీ పాలనలో దేశంలో అభివృద్ధి మాటే లేకుండా పోయిందన్నారు.
సంక్షేమం కనుమరుగైందన్నారు. కార్పొరేట్ శక్తుల కోసమే బీజేపీ ప్రభుత్వం పని చేస్తుందన్నారు. పేద, మధ్య తరగతి ప్రజల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో కాలనీ అసోసియేషన్ సభ్యులు,నాయకులు పాల్గొన్నారు..