ఇదేనిజం, వెబ్‌డెస్క్ : సోషల్ మీడియాలోని పోస్టులకు ప్రముఖ వ్యాపారవేత్తలు వేగంగా స్పందిస్తున్నారు. తాజాగా ప్రముఖ ఈ కామర్స్ సేవల సంస్థ బ్లింకిట్ సీఈఓ అల్బీందర్ సింగ్ ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ చెప్పారు. తమ యాప్‌లో కూరగాయలు కొంటే కొత్తిమీర ఫ్రీగా ఇవ్వనున్నట్లు తెలిపారు. దీంట్లో ప్రత్యేకత ఏముంది అంటారా?
సాధారణంగా కంపెనీలు బిజినెస్ స్ట్రాటజీలో భాగంగా వాటంతట అవే ఆఫర్లు ప్రకటిస్తుంటాయి. కస్టమర్లను ఆకర్షిస్తుంటాయి. కానీ ఈ ఆఫర్ అనేది ఓ కస్టమర్ నుంచి వచ్చిన రిక్వెస్ట్ మూలంగా.
ముంబయికి చెందిన అంకిత్ సావంత్ అనే వ్యక్తి ఇటీవల ‘ఎక్స్’లో ఓ పోస్ట్ పెట్టారు. ‘‘నేను బ్లింకిట్ (Blinkit)లో కూరగాయలు కొనుగోలు చేశా. అందులో కొత్తిమీరకు కూడా డబ్బులు చెల్లించడం చూసి మా అమ్మకు చిన్నపాటి హార్ట్‌ఎటాకే వచ్చింది. ఎక్కువ మొత్తంలో కూరగాయలు కొన్నప్పుడు కొత్తిమీర ఉచితంగా ఇస్తే బాగుంటుంది కదా అని మా అమ్మ సలహా’’ అని రాసుకొచ్చారు. ఇందులో బ్లింకిట్ సీఈవో అల్బీందర్ ధిండ్సాను ట్యాగ్ చేశారు.
దీనిపై స్పందించిన కంపెనీ సీఈఓ మేం పరిశీలిస్తాం అని రిప్లై ఇచ్చారు. మరికాసేపటికే కొత్తిమీరను ఫ్రీగా ఇస్తున్నట్లు పోస్టు చేశారు.
దీనిపై నెట్టింట భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు మాత్రం మిర్చి, పూదీన, మెంతి కూడా ఫ్రీగా ఇవ్వాలని కోరుతున్నారు. ఏదో ఒకటి ఎంచుకునేలా అప్షన్ ఇవ్వాలని మరికొందరి అభిప్రాయం.