హైదరాబాద్ – విజయవాడ రహదారి (National Highway 65 )పై ఉన్న బ్లాక్‌స్పాట్స్ మరమ్మతులకు మోక్షం దక్కింది. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి దీనిపై సమీక్ష నిర్వహించారు. మొత్తం 17 బ్లాక్‌స్పాట్స్ ఉన్నట్లు అధికారులు గుర్తిచారు. పనులకు అయ్యే ఖర్చు దాదాపు రూ. 326 కోట్లు అవుతుందని అంచనా వేశారు. గడిచిన మూడేళ్లలో 5 ప్రమాదాలు లేదా 10 మంది మరణించిన ప్రదేశాలను బ్లాక్‌స్పాట్స్‌గా గుర్తిస్తారు.