ముప్పై ఏండ్లలో హై-బీపీ రోగులు రెట్టింపు
ప్రపంచవ్యాప్తంగా అధిక రక్తపోటుతో (హైపర్‌టెన్షన్) బాధపడుతున్న రోగుల సంఖ్య గడిచిన ముప్పై ఏండ్లలో రెట్టింపైనట్టు ప్రఖ్యాత వైద్య పత్రిక ‘లాన్సెట్’లో ప్రచురితమైన ఓ అధ్యయనం పేర్కొంది. పేద, మధ్య తరగతి దేశాల్లోనే ఈ రోగుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్టు వెల్లడించింది. 184 దేశాల్లోని 30-79 వయసు గల 10 కోట్ల మందిపై ఈ అధ్యయనాన్ని నిర్వహించారు.
కీలకాంశాలు
- పరాగ్వేలో ప్రతి ఇద్దరు మహిళల్లో ఒకరు హైపర్‌టెన్షన్‌తో బాధపడుతున్నారు.
- అర్జెంటీనా, పరాగ్వే, తజికిస్థాన్‌లో ప్రతి ఇద్దరు పురుషుల్లో ఒకరు హైపర్‌టెన్షన్‌తో బాధపడుతున్నారు.
తమకు రక్తపోటు సమస్య ఉన్నదన్న విషయం తెలియనివారు 64 కోట్లు
హైపర్‌టెన్షన్‌తో ఏటా మరణిస్తున్నవారు 85 కోట్లు
చికిత్స చేయలేని స్థితికి చేరుకున్న హైపర్‌టెన్షన్ రోగులు
మహిళలు 32 కోట్లు
పురుషులు 44 కోట్లు