UAE ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పర్యావరణ పరిరక్షణకు విశేష కృషి చేసిన వ్యక్తులకు బ్లూ రెసిడెన్సీ వీసా జారీ చేయనుంది. కేబినెట్ మీటింగ్‌లో ఆమోదం లభించినట్లు యూఏఈ ప్రధాని షేక్ మహమ్మద్ బిన్ రషీద్ వెల్లడించారు. తమ దేశ ఆర్థిక స్థిరత్వం పర్యావరణ సమతుల్యతతో ముడిపడి ఉందని పేర్కొన్నారు. కొద్ది రోజుల క్రితం కుంభవృష్టి కారణంగా దుబాయ్ నగరం అతలాకుతలమైన సంగతి తెలిసిందే.
UAE లో ఇప్పటికే పెట్టుబడిదారులు, వ్యవస్థాపకులు, శాస్త్రవేత్తలు, అసాధారణ ప్రతిభ కలిగిన గ్రాడ్యుయేట్లకు 10 ఏళ్ల కాలపరిమితితో గోల్డెన్ వీసాను జారీ చేస్తున్నారు. ఇదేకాక గ్రీన్ వీసా, రిమోట్ వర్కింగ్ వీసాలను ఇటీవలి కాలంలో ప్రత్యేకంగా తీసుకొచ్చారు.