Boat Accident: కాంగోలో ఘోర పడవ ప్రమాదం చోటుచేసుకుంది. ఫుట్‌బాల్ ఆడగాళ్లు మై నోంబే ప్రావిన్స్‌లోని ముషీ పట్టణంలో జరిగిన మ్యాచ్ అనంతరం తిరిగి వస్తుండగా.. క్వా నదిలో పడవ బోల్తా పడింది. ప్రమాద సమయంలో పడవలో మొత్తం 55 మంది ఉండగా.. 25 మంది మృతి చెందారు. మిగిలిన వారిని రక్షించినట్లు ప్రొవిన్షియల్ ప్రతినిధి అలెక్సిస్ వెల్లడించారు. అయితే రాత్రి సమయం కావడంతో మిగిలిన వారిని రక్షించలేకపోయామని అన్నారు.