Bobby Simha : ప్రముఖ నటుడు బాబీ సింహా కారు ప్రమాదానికి గురైంది. ఎక్కడుతంగల్-చెన్నై ఎయిర్‌పోర్ట్ రోడ్డులో తమిళ నటుడు బాబీ సింహా ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి ఆయన ముందున్న వాహనాలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. ఈ క్రమంలో ఎదురుగా ఉన్న వాహనాలపైకి దూసుకెళ్లింది.డ్రైవర్ పుష్పరాజ్‌ను అదుపులోకి తీసుకున్నారు. అయితేడ్రైవర్ మద్యం సేవించి కారు నడపడం వల్లే ఈ సంఘటన జరిగిందని పోలీసులు నిర్ధారించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మరోవైపు, గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. నటుడు బాబీ సింహా ”వాల్తేరు వీరయ్య”, ”భారతీయుడు-2”, ”డిస్కో రాజా”, ”సాలార్” వంటి సినిమాల్లో నటించాడు.