Homeసినిమా'దీపికా పదుకొనె'ను నలిపేసిన ఫ్యాన్స్

‘దీపికా పదుకొనె’ను నలిపేసిన ఫ్యాన్స్

బాలీవుడ్లో నంబర్ వన్ హీరోయిన్ దీపికా పదుకొనె కు చేదు అనుభవం ఎదురైంది.

‘ఐశ్వర్య’ అనే కన్నడ చిత్రం ద్వారా హీరోయిన్‌గా పరిచయం అయిన ఈ భామ.. షారూఖ్ ‘ఓం శాంతి ఓం’తో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.

అప్పటి నుంచి వెనుతిరిగి చూసుకోలేదు. ఇప్పుడు టాప్ స్టార్ గా సత్తా చాటుతోంది.

ప్రస్తుతం భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ బయోపిక్ ’83’లో భర్త రణ్‌వీర్ సింగ్‌తో కలిసి నటిస్తోంది దీపిక.

వివాహం తర్వాత కూడా సత్తాచాటుతూ టాప్ గేర్ లో దూసుకెళ్తోంది.

అయితే.. కెరీర్ పరంగా ఎంత బిజీగా ఉన్నా.. వీలు చిక్కినప్పుడల్లా భర్తతో కలిసి డిన్నర్ డేట్లకు వెళ్తూనే ఉంటుంది.

ఇదేవిధంగా.. గురువారం రాత్రి ముంబైలోని ఓ రెస్టారెంట్‌కు ఒంటరిగా డిన్నర్ కు వెళ్లింది దీపిక.

అయితే.. డిన్నర్ పూర్తయిన తర్వాత కారు ఎక్కేందుకు దీపిక బయటకు వచ్చింది.

ఆ సమయంలో దీపికను చూసిన అభిమానులు ఒక్కసారిగా ఆమెను చుట్టుముట్టారు.

తమ అభిమాన హీరోయిన్ తో సెల్ఫీలు తీసుకునేందుకు పోటీపడ్డారు. ఆమె ఆటోగ్రాఫ్ కోసం ఎగబడ్డారు.

ఫ్యాన్స్ అంతా చుట్టూ మూగడంతో ఏం జరుగుతుందో అర్థం కాలేదు దీపికకు.

ఈ క్రమంలో కొందరు ఆమె దగ్గరకు చేరి నలిపేశారు.

సరిగ్గా అప్పుడే ఓ మహిళ.. దీపిక చేతిలో ఉన్న హ్యాండ్ బ్యాగ్‌ను లాగేసింది.

వెంటనే ‘ఏక్ మినిట్.. ఏక్ మినిట్’ అంటూ దీపిక అరిచింది.

అలర్ట్ అయిన బాడీగార్డ్స్ సదరు మహిళ నుంచి బ్యాగ్ తీసుకున్నారు. ఆ తర్వాత వెంటనే కారెక్కి వెళ్లిపోయింది దీపిక

Recent

- Advertisment -spot_img