Bollywood : ప్రస్తుతం బాలీవుడ్ పరిస్థితి దారుణంగా ఉంది. అక్కడ సినిమాలు వరుసగా ప్లాప్ లు అవుతున్నాయి. బాలీవుడ్ డైరెక్టర్స్ హిట్ సినిమాలు తీయడంలో వెనుకపడుతున్నారు. ఈ క్రమంలో బాలీవుడ్ హీరోలు తెలుగు డైరెక్టర్స్ తో సినిమాలు చేయడానికి ఇష్ట పడుతున్నారు. ఇటీవలే తెలుగు డైరెక్టర్స్ వరుసగా హిందీలో భారీ హిట్లు ఇచ్చారు. బాలీవుడ్‌లో తెలుగు దర్శకులు తమ సినిమాలతో గణనీయమైన ప్రభావం చూపిస్తున్నారు. పాన్-ఇండియా సినిమాల హవా నేపథ్యంలో వీరు బాలీవుడ్ హీరోలతో కలిసి పనిచేస్తూ విజయాలు సాధిస్తున్నారు.
ఎస్.ఎస్. రాజమౌళి : మొదటిగా బాలీవుడ్‌లో తెలుగు సినిమాలు మార్కెట్ ను ఓపెన్ చేసింది రాజమౌళి. ఆయన దర్శకత్వంలో వచ్చిన బాహుబలి: ది బిగినింగ్ (2015) మరియు బాహుబలి: ది కంక్లూజన్ (2017) హిందీలో డబ్ అయి బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించాయి. ఈ చిత్రాలు బాలీవుడ్‌లో తెలుగు సినిమాల స్థాయిని చాటాయి. ఆ తరువాత RRR సినిమాతో హిందీలో భారీ కలెక్షన్స్ రాబెట్టాడు.ఈ సినిమా బాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాక, గ్లోబల్ స్థాయిలో గుర్తింపు తెచ్చింది.
సందీప్ రెడ్డి వంగా : సందీప్ రెడ్డి వంగా తన తొలి తెలుగు సినిమా అర్జున్ రెడ్డి (2017)తో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందాడు. ఈ సినిమాని హిందీలో కబీర్ సింగ్ (2019)గా రీమేక్ చేశారు, షాహిద్ కపూర్ హీరోగా నటించగా, ఇది బాలీవుడ్‌లో భారీ హిట్ అయింది. ఆ తరువాత రణ్‌బీర్ కపూర్‌తో తీసిన ”యానిమల్” సినిమా బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది.
గోపీచంద్ మలినేని : గోపీచంద్ మలినేని బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్‌తో ”జాట్” అనే సినిమాని తీసాడు. ఈ సినిమా హిందీలో మంచి విజయం సాధించింది. ఈ సినిమా హిందీలో ఏకంగా 100కోట్లు కలెక్షన్స్ రాబెటింది.
సుకుమార్ : క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తన పుష్ప సినిమాతో బాలీవుడ్‌లో భారీ హిట్టు కొట్టాడు. ఈ సినిమా హిందీలో డబ్ అయి భారీ విజయం సాధించింది. అలాగే పుష్ప 2 సినిమా కూడా హిందీలో బాక్సాఫీస్ వద్ద రికార్డులు బద్దలు కొట్టింది, బాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.
తెలుగు దర్శకులు బాలీవుడ్‌లో విజయం సాధిస్తున్నారు, ఎందుకంటే వారి కథలు మరియు దర్శకత్వ శైలి ఉత్తర భారత ప్రేక్షకులకు నచ్చుతున్నాయి. ఈ దర్శకులు తమ సినిమాల ద్వారా బాలీవుడ్ హీరోలతో కలిసి పనిచేస్తూ, తెలుగు సినిమా ఇండస్ట్రీని గ్లోబల్ స్థాయికి తీసుకెళ్తున్నారు.