Homeఫ్లాష్ ఫ్లాష్డ్రగ్స్‌ కేసు: దీపిక, రకుల్‌, శ్రద్ధా కపూర్‌, సారా అలీఖాన్‌లకు ఎన్సీబీ నోటీసులు

డ్రగ్స్‌ కేసు: దీపిక, రకుల్‌, శ్రద్ధా కపూర్‌, సారా అలీఖాన్‌లకు ఎన్సీబీ నోటీసులు

ముంబయి: డ్రగ్​ కేసు బాలీవుడ్‌ను కుదిపేస్తోంది. నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య కేసులో డ్రగ్స్‌ కోణం బయటపడటంతో రంగంలోకి దిగిన మాదక ద్రవ్యాల నియంత్రణ విభాగం(ఎన్సీబీ) అధికారుల దర్యాప్తు ప్రకంపనలు సృష్టిస్తోంది. డ్రగ్​ కేసులో రియాను అరెస్టు చేసిన ఎన్సీబీ అధికారులు తాజాగా మరికొందరు బాలీవుడ్‌ తారలకు నోటీసులు జారీ చేశారు.
బాలీవుడ్‌ నటీమణులు దీపికా పదుకొణె, సారా అలీఖాన్‌, శ్రద్ధా కపూర్‌, రకుల్‌ప్రీత్ సింగ్‌కు నోటీసులు జారీ చేసినట్టు అధికారులు వెల్లడించారు. నోటీసులు అందిన మూడు రోజుల్లో విచారణకు హాజరు కావాలని ఎన్సీబీ ఆదేశించింది. వీరితో పాటు దీపికా మేనేజర్‌ కరిష్మ, సుశాంత్‌ మేనేజర్‌ శృతి మోదీని కూడా విచారణకు పిలిచారు.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img