Homeసినిమాబాలీవుడ్ డ్రగ్స్ కేసులో మహేష్‌బాబు సతీమణి నమ్రత!

బాలీవుడ్ డ్రగ్స్ కేసులో మహేష్‌బాబు సతీమణి నమ్రత!

హైదరాబాద్​: బాలీవుడ్ డ్రగ్స్‌ కేసులో రోజుకో పేరు విన్పిస్తోంది. తాజాగా టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్ కూడా చేరింది. ఈ మేరకు కొన్ని జాతీయ చానల్స్ నమ్రతా శిరోద్కర్ పేరును ప్రస్తావించాయి. ‘బాంబేలో మంచి ఎండీ ఇస్తావని ప్రామిస్ చేశావు.. ఎండీ ఇచ్చాక మనం కలిసి పార్టీ చేసుకుందామని నమ్రత టాలెంట్ మేనేజర్ జయ సాహుతో చాటింగ్​ చేసినట్లు’ మీడియా కథనాల్లో పేర్కొన్నాయి. సుశాంత్ మరణం అనంతరం డ్రగ్స్ కోణం వెలుగు చూడటంతో అతని గర్ల్‌ఫ్రెండ్ రియా చక్రవర్తిని ముంబాయి నార్కొటిక్​ అధికారులు అరెస్ట్ చేశారు. ఆమె వద్ద నుంచి కీలక సమాచారం రాబడుతున్నారు. ఈ నేపథ్యంలోనే మీడియాలో ఒక్కొక్కటిగా కొత్త పేర్లు తెరపైకి వస్తున్న విషయం తెలిసిందే.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img