హైదరాబాద్: బాలీవుడ్ డ్రగ్స్ కేసులో నిర్మాత మధు మంతెనకు ఎన్‌సీబీ అధికారులు నోటీసులు ఇచ్చారని, ఆయన బుధవారం విచారణకు హాజరవుతున్నారని సమాచారం. అనురాగ్ కశ్యప్, వికాల్ బాల్, విక్రమాదిత్యతో కలిసి ఫాంటమ్ ఫిలింస్‌ను స్టార్ట్ చేసిన మధు మంతెన తెలుగులో ఆర్జీవీ చిత్రం ‘రక్తచరిత్ర’ను నిర్మించారు.అలాగే బాలీవుడ్ లోనూ ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించారు.
నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో విచారణలో పెద్ద లిస్టు బయటపడినట్లు వార్తలు వినిపించాయి. ఇప్పటికే రియా చక్రవర్తిని ఎన్‌సీబీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ లిస్టులో దీపికా పదుకొనె సహా టాలీవుడ్‌కు చెందిన నమ్రతా శిరోద్కర్, రకుల్ పేర్లు ఉన్నట్లు వీరికి ఎన్‌సీబీ నోటీసులు ఇవ్వబోతున్నట్లు జాతీయ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.