HCU : తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం HCU భూ వివాదం సంచలనంగా మారింది. యూనివర్సిటీ క్యాంపస్‌లోని భూముల వేలం వివాదం కొనసాగుతోంది. అయితే 30 జేసీబీలతో HCUలోని చెట్లును సీఎం రెడ్డి ప్రభుత్వం తొలగించింది. ఈ భూ వివాదంపై తెలుగు సినీ సెలెబ్రెటీలు స్పందించారు. తాజాగా దీనిపై బాలీవుడ్ హీరో జాన్ అబ్రహం స్పందించారు. నగరానికి ఆక్సిజన్ అందించే 400 ఎకరాల చెట్లు నరికివేసే ప్రణాళికను రద్దు చేయాలని జాన్ అబ్రహం అన్నారు. తెలంగాణలో జరిగినా విషయంపై బాలీవుడ్ స్టార్ హీరో స్పందించాడు కానీ మన తెలుగు స్టార్ హీరోలు మాత్రం ఇప్పటివరకు మౌనంగా ఉన్నారు. తెలుగు సినీ ఇండస్ట్రీకి బాస్ అనే పిల్చుకునే మెగాస్టార్ చిరంజీవి దీనిపై స్పందించలేదు. అలాగే నేటి తరం హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాస్, మహేష్ ఇప్పటివరకు రాష్ట్రంలో HCU భూమిపై ఇంత విధ్వసం జరుగుతున్న స్పందించకపోవడం గమనార్హం.