Homeహైదరాబాద్latest Newsబాలీవుడ్ హీరోని సమంత పెళ్లి చేసుకోనుందా..?

బాలీవుడ్ హీరోని సమంత పెళ్లి చేసుకోనుందా..?

తెలుగు,తమిళం, హిందీ చిత్రసీమలో హీరోయిన్ సమంత అగ్రనటిగా ఎదిగింది. సమంత తన అందం మరియు నటనా కౌశలంతో అభిమానులతో బాగా ప్రాచుర్యం పొందింది. 2010లో సినీ రంగ ప్రవేశం చేసిన ఆమె తక్కువ కాలంలోనే అగ్రనటిగా ఎదిగింది. బోనీకపూర్ మొదటి భార్య నుండి కుమారుడు మరియు బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్ ని సమంత పెళ్లి చేసుకోబోతుంది అని వార్తలు వస్తున్నాయి. హీరో అర్జున్ కపూర్ అంతకముందు నటి మలైకా అరోరాతో ప్రేమ వ్యవహారం నడిపాడు. అయితే గత కొన్ని నెలలుగా వీరిద్దరూ విడిపోయారని వార్తలు వచ్చాయి. ప్రస్తుతం సమంత అర్జున్ కపూర్ ప్రేమలో ఉన్నారని తెలుస్తుంది. ఒక ఇంటర్వ్యూ లో సమంతా మీరు ఒంటరిగా ఉన్నారా లేదా ఎవరితోనైనా ప్రేమలో ఉన్నారా? అని ఇటీవల ప్రశ్నించగా.. ‘త్వరలో మీరే చూస్తారు’ అని బదులిచ్చారు.అయితే సమంత ఎప్పుడు ముంబై వెళ్లినా అర్జున్ కపూర్ ఇంట్లోనే ఉంటారని, ఇద్దరూ జంటగా పార్టీలకు వెళ్తారని అంటున్నారు. సమంత, అర్జున్ కపూర్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటి వరకు ఈ వార్తలను వీరిద్దరూ ఆ వార్తలను ధృవీకరించలేదు.

Recent

- Advertisment -spot_img