Bollywood Mahabharatham : ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తన సినిమాల ద్వారా పాన్ ఇండియాలోనే కాకుండా ప్రపంచంలోనే గొప్ప డైరెక్టర్ గా పేరును సంపాందించారు. ప్రస్తుతం మహేష్ బాబుతో రాజమౌళి ”SSMB29” అనే సినిమా చేస్తున్నాడు. రాజమౌళి తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయినా ”మహాభారతం” (Mahabharatham) కథకు దర్శకత్వం వహించాలన్నదే తన చిరకాల వాంఛ అని చాలాసార్లు చెప్పారు. అయితే ఈ క్రమంలో రాజమౌళి తీయాలి అనుకున్న సినిమాని ఇప్పుడు ఒక బాలీవుడ్ స్టార్ హీరో అమిర్ ఖాన్ తీయాలని ప్లాన్ చేస్తున్నాడు.
ప్రస్తుతం వరుస ప్లాప్ లతో డీలా పడిన అమిర్ ఖాన్ తన సత్తా ఏంటో మరోసారి చూపించాలని ప్లాన్ చేస్తున్నాడు. ఇందుకోసం ఏకంగా రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ ను తాను తీయాలని చూస్తున్నాడు. తాజాగా అమీర్ ఖాన్ ”మహాభారతం” సినిమా గురించి కొన్ని కామెంట్స్ చేసారు. ఒక ఇంటర్వ్యూలో అమీర్ ఖాన్ మాట్లాడుతూ.. నేను మహాభారత ఇతిహాసాన్ని తీయాలని అనుకుంటున్నాను. ఈ మహాభారత సినిమాను నేటి తరానికి అందించాలనేది నా కోరిక. ఈ సంవత్సరం దానిపై పని ప్రారంభించాలనుకుంటున్నాను. ”మహాభారతం” కథను ఒకే సినిమాలో చూపించలేము. అందుకే దీన్ని సిరీస్‌గా ప్రజెంట్ చేయాలని నిర్ణయించుకున్నాను. ఈ ప్రాజెక్ట్ కోసం పరిశ్రమలోని చాలా మంది దర్శకులు పని చేయనున్నారు. కథ రాసిన తర్వాత, పాత్రలకు ఎవరు సరిపోతారో చూసి, ఆ తర్వాత నటీనటులను ఎంపిక చేస్తాం అని అమీర్ ఖాన్ అన్నారు. అయితే మరోవైపు గతంలో తమిళ డైరెక్టర్ లింగుస్వామి కూడా ”మహాభారతం” తీస్తున్నట్లు ప్రకటించారు.