Homeహైదరాబాద్latest NewsBollywood : Tiger​–3 రన్​ టైమ్​ పొడిగింపు..!

Bollywood : Tiger​–3 రన్​ టైమ్​ పొడిగింపు..!

యశ్​రాజ్​ ఫిల్మ్స్ స్పై యూనివర్స్‌లో వస్తున్న ఐదో సినిమా, టైగర్​ ప్రాంచైజ్​లో మూడో సినిమా టైగర్–3. దీపావళి కానుకగా ఈ నెల 12న వరల్డ్ వైడ్​గా థియేటర్లలో గ్రాండ్​గా రిలీజ్ కానుంది. సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్​ జంటగా నటిస్తున్న ఈ సినిమాకు మనీష్ శర్మ దర్శకత్వం వహించారు. ఇమ్రాన్ హష్మీ నెగిటివ్ రోల్​ చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాలో షారుఖ్ ఖాన్, హృతిక్ రోషన్​ గెస్ట్ రోల్స్​కు సంబంధించిన వార్తలు వచ్చాయి. ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం టైగర్–3 రన్​టైమ్​ను మరో 2 నిమిషాల 22 సెకన్లకు పెంచారు. బాలీవుడ్ మీడియాలోని కథనాల ప్రకారం టైగర్–3లో హాలీవుడ్ ప్రాంచైజీ మూవీస్ మాదిరిగా క్రేజీ పోస్ట్ క్రెడిట్ సీన్ ఉన్నట్లు సమాచారం. యశ్​రాజ్ ఫిల్మ్స్ సంస్థ నుంచి వార్– 2 ఇప్పటికే స్టార్ట్ అయ్యింది. టైగర్ వర్సెస్ పఠాన్ త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. కాబట్టి, ఈ పోస్ట్ క్రెడిట్ సీన్‌లో మనం షారుఖ్ లేదా హృతిక్ రోషన్‌ని చూడవచ్చు. మేకర్స్ మనకు ఏం చూపించనున్నారో తెలుసుకోవాలంటే నెల 12 వరకు వేచి ఉండాల్సిందే.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img