Bollywood : గత కొన్ని సంవత్సరాలుగా బాలీవుడ్ (Bollywood) సంక్షోభంలో ఉంది. అక్కడి సూపర్ స్టార్ల సినిమాలు కూడా అక్కడ ఆడటం లేదు. గత రెండు మూడు సంవత్సరాలలో షారుఖ్ ఖాన్ తప్ప మరెవరూ హిట్టు కొట్టలేదు. గత సంవత్సరం, ”భూల్ భూలయ్య 3” మరియు ”సింగం ఎగైన్” తప్ప, మరే ఇతర స్టార్ హీరోల సినిమాలు విజయం సాధించలేదు. నేటి ఉత్తరాది మార్కెట్‌లో హిందీ చిత్రాల కంటే దక్షిణాది చిత్రాలకు చాలా ఎక్కువ డిమాండ్ ఉంది. బీహార్, ఉత్తరప్రదేశ్, హర్యానా మరియు జార్ఖండ్‌లలో చాలా మంది యష్, అల్లు అర్జున్ మరియు ప్రభాస్‌లకు వీర అభిమానులు ఉన్నారు. అయితే తాజాగా బాలీవుడ్ ప్రముఖ స్క్రీన్ రైటర్ మరియు గేయ రచయిత జావేద్ అక్తర్ దక్షిణాది హీరోలుపై కొని కీలక వ్యాఖ్యలు చేసారు.
జావేద్ అక్తర్ మాట్లాడుతూ.. తెలియని దక్షిణాది హీరోలు తమ సినిమాలను హిందీలోకి డబ్ చేసి మన భాషలోనే 600-700 కోట్లు వసూల్ చేస్తునారు అని తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. మనలో కొందరు దక్షిణ భారత సినిమాలను కూడా రీమేక్ చేస్తున్నారు అని అన్నారు. జావేద్ అక్తర్ ప్రకటనపై ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. కొందరు జావేద్ అక్తర్ మాటలను సమర్థించగా, మరికొందరు అతనిపై విమర్శలు గుప్పించారు. ప్రేక్షకుల నాడి తెలుసుకోకుండా చెత్త సినిమా తీస్తే, ప్రేక్షకులు థియేటర్‌కి ఎందుకు వస్తారు అని ప్రశ్నిస్తున్నారు. దక్షిణాదిలో మంచి సినిమాలు వస్తున్నాయి, అందుకే జనాలు దక్షిణాది సినిమాలను ఎక్కువగా ఇష్టపడుతున్నారు అందులో తప్పేముంది అని నెటిజన్స్ అంటున్నారు.